లై డిటెక్టర్ పరీక్షకు మేము సిద్ధంగా ఉన్నాము: రెజ్లర్లు

by Mahesh |
లై డిటెక్టర్ పరీక్షకు మేము సిద్ధంగా ఉన్నాము: రెజ్లర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా లై డిటెక్టర్, నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలకు సిద్ధం అంటే తాను కూడా.. ఆ పరీక్షలు చేయించుకుంటానని.. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ రెజ్లర్లకు సవాల్ విసిరాడు. దీంతో WFI చీఫ్ సవాల్ పై స్పందించిన రెజ్లర్లు.. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా తాము బ్రిజ్ సవాల్ స్వీకరిస్తున్నామని.. చెప్పుకొచ్చారు. అలాగే మొత్తం ఏడుగురు ఫిర్యాదుదారుల కూడా ఈ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునియా తెలిపారు. అలాగే ఆ పరీక్షలు ప్రత్యక్షంగా చేయాలి అప్పుడే అతని క్రూరత్వం గురించి దేశం మొత్తం తెలుస్తుంది" అని ఫోగట్ పేర్కొంది.

Advertisement

Next Story