ముంబైని అదానీ సిటీగా మార్చనివ్వబోము.. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |
ముంబైని అదానీ సిటీగా మార్చనివ్వబోము.. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గౌతమ్ అదానీకి చెందిన ధారవి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టెండర్‌ను రద్దు చేస్తామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆ టెండర్‌ను అదానీకి ఇచ్చారని తెలిపారు. శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ధారావి నివాసితులు, వారి వ్యాపారాలు డెబ్బతినకుండా నియంత్రిస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజలకు తప్పనిసరిగా 500 చదరపు అడుగుల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంబై పేరును అదానీ నగరంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రపంచంలోని అత్యంత దట్టమైన పట్టణ ప్రాంతాల్లో ఒకటైన ధారావిని పునరాభివృద్ధి చేసేందుకు కాంట్రాక్ట్‌లో పేర్కొనని అదనపు రాయితీలు అదానీ గ్రూప్‌కు ఇస్తున్నట్టు ఆరోపించారు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed