- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు మోడీయే ప్రధాని కావాలి.. పాక్ పౌరుడు
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ యూట్యూబర్ సనా అమ్జద్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాకిస్థాన్ పౌరుడు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువులను తాము ఈ ప్రభుత్వంలో కొనలేకపోతున్నామని అందుకే పాకిస్థాన్ కు ప్రధానిగా మోడీ కావాలని కాంక్షించాడు.
కాగా సనా అమ్జద్ పాకిస్థాన్ పలు మీడియా సంస్థల్లో విధులు నిర్వర్తించారు. ఈ వైరల్ వీడియోలో 'పాకిస్థాన్ సే జిందా బాగో.. చాహే ఇండియా ఛలే జావో' అనే నినాదం వీధుల్లో ఎక్కువగా వినబతుతుంది కదా అని యువకున్ని ప్రశ్నించగా స్పందించిన యువకుడు పాకిస్థాన్‌లో పుట్టకపోయుంటే బాగుండేదన్నాడు. తనతో పాటు ఇతర పౌరులు సైతం తమ చిన్నారుల కోసం నిత్యావసర వస్తువులను కోనలేకపోతున్నట్లు వాపోయాడు.
పాకిస్థాన్ ఇండియా నుంచి విడిపోయి ఉండకపోతే బాగుండు అని అభిప్రాయ పడ్డాడు. అలా అయితే తాము రూ.20 కే టమాటాలు, రూ.150 కే చికెన్, పాకిస్థాన్ కరెన్సీలో రూ.50 కే పెట్రోల్ కొనే వారమన్నారు. దురదృష్టవశాత్తు తాము ఇస్లాం దేశంలో ఉన్నామని కానీ ఇక్కడ ఇస్లాం ఏర్పాటు కాలేదన్నారు. పాకిస్థాన్‌లో ఉండాలంటేనే బాధగా ఉందన్నాడు. మోడీ ఇక్కడి కన్నా చాలా నయమన్నాడు.
అక్కడి ప్రజలు ఆయనను గౌరవిస్తారని.. ఫాలో అవుతారని తెలిపాడు. మనకు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉంటే నవాజ్ షరీఫ్, బెనజీర్, ఇమ్రాన్, పర్వేజ్ ముషారఫ్‌ల అవసరం లేదన్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో మోడీ సమర్థంగా పాలిస్తున్నారని ఆ యువకుడు వీడియోలో తెలిపాడు. ఇండియా ఎకనమీలో ఐదో అతి పెద్ద దేశంగా ఉంటే మనం దరిదాపుల్లో కూడా లేమని తెలిపాడు.
తాను మోడీ పాలనలో జీవించాలనుకుంటున్నట్లు తెలిపాడు. మోడీది సున్నితమైన మనస్తత్వం అని కితాబు ఇచ్చాడు. తమ దేశాన్ని మోడీ పాలించాలని తాను దేవున్ని ప్రార్థిస్తున్నట్లు కళ్లలో కన్నీళ్లతో ఆ యువకుడు తెలిపాడు. పాకిస్థాన్ ఇండియాతో పోల్చుకోవడం మానాలని.. వారికి మనకు పోలిక లేదన్నాడు.