వాటికి భయపడే ప్రసక్తే లేదు.. బీజేపీతో పొత్తుపై జేడీ(యూ)

by Javid Pasha |
వాటికి భయపడే ప్రసక్తే లేదు.. బీజేపీతో పొత్తుపై జేడీ(యూ)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బీహార్ రాజకీయాలు దేశమంతా హాట్ టాపిక్‌గా నడుస్తున్నాయి. బీజేపీతో తమ పొత్తును విరమించుకున్న జనతాదళ్ పార్టీ ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వ స్థాపన చేసింది. అంతేకాకుండా ప్రతిపక్షాలతో కూటమి ఏర్పరిచిన అనంతరం నితీష్ కుమార్ వరుసగా ఎనిమిదో సారి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రస్తుతం బీజేపీ తన అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలత ద్వారా దాడులకు పాల్పడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దర్యాప్తు సంస్థల దాడులపై జేడీ(యూ) పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈడీ, సీబీఐ సంస్థలకు జేడీ(యూ) భయపడదని తెలిపింది.

అయితే జేడీ(యూ) నిర్ణయంతో బీజేపీ చేస్తున్న ద్రోహం ఆరోపణలపై జనతాదళ్ జాతీయ నేత రాజీవ్ రంజన్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో తమ ఎమ్మెల్యేలను దూరం పెట్టడం ద్వారా మాజీ మిత్రపక్షం సంకీర్ణ ధర్మాన్ని మోసం చేసిందని ఆయన అన్నారు. అంతేకాకుండా నితీష్ కుమార్‌తో ఆ ఎమ్మెల్యే కలిగి ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే బీజేపీ అతడిని తొలగించిందని, అది ఒక రకంగా ఎమ్మెల్యేకు రాజకీయ పునరావాసాన్ని కల్పిస్తుందని రాజీవ్ రంజన్ తెలిపారు. దాంతో పాటుగా బీజేపీతో పొత్తును విరమించుకోవడం ద్వారా దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతీకార చర్యలకు జేడీ(యూ) సిద్ధం కావాల్సి వస్తుందా అని ప్రశ్నించారు. 'దర్యాప్తు సంస్థలను ప్రయోగించనివ్వండి. మేము ఈడీ, సీబీఐలకు భయపడం. ఎవరైతే కంపెనీలను నడుపుతారో వారు భయపడాలి. మేము మాకు ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నందుకు వచ్చే జీతంపైన, ఇతర చట్టపరమైన దారుల్లో సంపాదించే డబ్బుపైనే ఆధారపడతాం' అని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed