మేం ఎవరి సొమ్మూ తినడం లేదు.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Geesa Chandu |
మేం ఎవరి సొమ్మూ తినడం లేదు.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ సింగ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మోహన్ యాదవ్ చేసిన 'ఖానా ఖజానా' వ్యాఖ్యలపై, బీజేపీ పైనా ఒవైసీ మండి పడ్డారు. ఒవైసీ మాట్లాడుతూ.. "ఈ దేశం అందరికీ చెందుతుందని, సీఎం మా బిల్లులను చెల్లించడం లేదని, ఇప్పటికీ మా ఖర్చులను మేమే భరిస్తున్నామని, మేము ఎవరి సహాయాన్ని కోరడం లేదని తెలిపారు. దేశంలోని వనరులు, సంపద, ఆస్తి కొంత మంది వద్దే ఉంటున్నాయని.. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సంపద అసమానతలు లేకుండా పంపిణీ జరగాలని, కానీ అది ఎందుకు జరగడం లేదని అన్నారు. దేశ సంపదలో 60 శాతం సంపద కేవలం 5 శాతం మంది వద్దే ఎందుకు ఉందని వ్యాఖ్యానించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు మధ్యప్రదేశ్ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఒవైసీ. దేశంలోని పేదలు పోషకాహార లోపంతో బాధపడుతున్నా.. బీజేపీ మాత్రం పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల అవసరాలను మాత్రమే తీరుస్తుందని విమర్శించారు.

కాగా.. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. చందేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "మీరు జాగ్రత్తగా వినండి. కొందరు ఇక్కడ తిండి తింటూ..ఇతరులకు విధేయత చూపిస్తారు. దీన్ని మేం అనుమతించం" అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి తమ మతాన్ని అనుసరించే పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed