Water Leakage In Taj Mahal: భారీ వర్షాలకు తాజ్ మహల్ లో లీకేజీ..!

by Shamantha N |
Water Leakage In Taj Mahal: భారీ వర్షాలకు తాజ్ మహల్ లో లీకేజీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రాలో రెండ్రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో తాజ్ మహల్(Taj Mahal) దగ్గర వాటర్ లీకేజీ అయ్యింది. తాజ్ మహల్ దగ్గరున్న తోట మునిగిపోయింది. కానీ, ప్రధాన గోపురానికి(main dome) ఎలాంటి నష్టం జరగలేదని.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) తెలిపింది. ప్రధాన గోపురంపై తేమను గమనించిన తర్వాత హెయిల్ లైన్ క్రాక్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్రాక్స్ గురించి పరిశీలించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. తాజ్ మహల్ ని తనిఖీ చేయడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని చెప్పారు. నీటి లీకేజీనలను నిరంతరంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

వైరల్ గా మారిన దృశ్యాలు

వరదలతో నిండిన తాజ్ మహల్ తోట దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై స్థానికులతో పాటు పర్యాటకులలో ఆందోళనల చెందుతున్నారు. స్మారక చిహ్నంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, ఆగ్రాలో గురువారం 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 80 ఏళ్లలో 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. ఎడతెరిపి లేని వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ఆగ్రాలోని అన్ని పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఆగ్రాలోని ఇతర చారిత్రక ప్రదేశాలైన ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, జుంఝున్ కా కటోరా, రాంబాగ్, మెహతాబ్ బాగ్, చినీ కా రౌజా, సికంద్రాలోని అక్బర్ సమాధి, రోమన్ క్యాథలిక్ శ్మశానవాటిక కూడా భారీవర్షాల వల్ల స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Advertisement

Next Story