- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల నిరసనతో అట్టుడికి బెంగాల్.. వాటర్ గన్, టియస్ గ్యాస్ ప్రయోగం
దిశ, వెబ్ డెస్క్: ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ రేప్-మర్డర్ కేసు యావత్ దేశాన్ని స్పందించేలా చేసింది. ఈ ఘటనపై భారత్ లోని ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. అయితే బెంగాల్ లో ఈ ఘటనపై మిడ్ నైట్ ప్రొటెస్ట్ కు పిలుపునిచ్చిన ఓ గ్రూప్ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ లోని పలు విభాగాలను పూర్తిగా ద్వంసం చేసింది. అదే క్రమంలో కాలేజ్ ముందు నిరసన తెలుపుతున్న డాక్టర్లపై కూడా దాడులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావోస్తుందని నిందితులను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని.. 'నబన్న అభియాన్' మార్చ్‌కు పశ్చిమ బెంగాల్ ని విద్యార్థి సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో వేలాదిగా రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్రమంలో హౌరా బ్రిడ్జి పై భారీ ఎత్తున కంటైనర్లు, బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసన కారులను చేదరగోట్టేందుకు పోలీసులు విద్యార్థులపై వాటర్ క్యాన్లను ప్రయోగించారు. అలాగే టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.