Waqf panel: జేపీసీ నుంచి తప్పుకుంటాం.. స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష ఎంపీల లేఖ

by vinod kumar |
Waqf panel: జేపీసీ నుంచి తప్పుకుంటాం.. స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష ఎంపీల లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill)పై చర్చించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Jpc)లో ఉన్న ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla)కు సోమవారం లేఖ రాశారు. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్(Jagadhambika paul) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయడం, సాక్ష్యులను పిలవడం వంటి కీలక విషయాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇతర కమిటీ సభ్యుల(Commitee members)ను సంప్రదించకుండా మూడు రోజుల సెషన్ నిర్వహిస్తున్నారని, ఇది సరైన పద్దతి కారదని తెలిపారు. పారదర్శకతను పాటించడం లేదని, దీని వల్ల ప్యానెల్ ఉద్దేశం దెబ్బతినే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.

జేపీసీ కూడా చిన్న పార్లమెంట్ లాంటిదని, ఇందులో ప్రతిపక్ష ఎంపీల వాదన కూడా వినిపించాలని సూచించారు. విధివిధానాలు పాటించకుండా బిల్లును ఆమోదించరాదని స్పష్టం చేశారు. పాల్ వైఖరి ఈ విధంగానే ఉండి, కమిటీలో అధికారిక సంప్రదింపులు జరిగేలా ఎలాంటి మార్పులు చేయకపోతే జేపీసీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. జేపీసీ కమిటీని ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకురావడానికి ఏర్పాటు చేసిన వెంటిలేటర్ చాంబర్ గా ఉపయోగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో స్పీకర్ బిర్లా జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. కీలక నిర్ణయాలలో కమిటీ సభ్యులు పాల్గొనేలా చూడాలని జేపీసీ చీఫ్‌ను ఆదేశించాలని తెలిపారు.

కాగా, వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ని సమీక్షించడానికి 31 మంది సభ్యులతో జేపీసీ కమిటీని ఈ ఏడాది ఆగస్టు 9న ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ కమిటీలో లోక్‌సభ (Loke sabha) నుంచి 21 మంది, రాజ్యసభ(Rajya sabha) నుంచి 10 మంది సభ్యులు ఉన్నారు. జేపీసీలోని ప్రతిపక్ష ఎంపీల్లో ద్రవిడ మున్నేట్ర కజడం(Dmk)కు చెందిన రాజా, కాంగ్రెస్‌ (Congress)కు చెందిన మహ్మద్ జావేద్, ఇమ్రాన్ మసూద్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీలు ఉన్నారు. జేపీసీ కమిటీ ఇప్పటికే పలు సమావేశాలను నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించింది.

Advertisement

Next Story