EPFO Wage ceiling: ఉద్యోగుల వేతన పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం

by Shamantha N |
EPFO Wage ceiling: ఉద్యోగుల వేతన పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో, ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని(EPFO Wage ceiling) పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ (EPFO) గరిష్ఠ వేతన పరిమితి రూ. 15వేలు ఉండగా.. దాన్ని రూ.21వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక, దీంతో పాటు ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపైనా పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓలో చేరాల్సిఉండగా.. ఈ సంఖ్యను 10-15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రతిపాదనను మాత్రం చిన్న-మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.

వేతన పరిమితి పెరిగితే..

ఇకపోతే, వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి (EPFO Wage ceiling)ని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న అమౌంట్ ని రూ.15వేలకు పెంచారు. వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరగనుంది. ఉద్యోగి నుంచి, యజమాని నుంచి 12 శాతం డబ్బు చెల్లిస్తారు. ఈ మొత్తం పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతా (Employee EPF account)లో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో.. మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితి (EPFO Wage ceiling)ని పెంచితే ఆ మేరకు ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ (EPS) ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్‌ సమయానికి ఉద్యోగికి అధికమొత్తంలో డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed