- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా పర్యటన ముందు మణిపూర్‌లో మళ్లీ హింస
దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ముందు మరోమారు హింస చెలరేగింది. నిన్న మరోమారు అల్లర్లు రేకెత్తాయి. మరోసారి చెలరేగిన హింసాకాండలో ఓ పోలీసు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 80కి పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు సెరౌ, సుగుణు ప్రాంతాల్లోని పలు ఇళ్లపై తూటాల వర్షం కురిపించినట్టు పేర్కొన్నారు.
కాగా, గత రెండు రోజుల్లో 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. ఇంఫాల్ లోయలోని శివారు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పౌరులపై జరుగుతున్న హింసాత్మక దాడులు ముందుస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఘర్షణలకు కారణమైన మెయిటీ, కుకీ తెగలను సంయమనం పాటించాలని కోరారు.