Vinesh Phogat : వినేష్ ఫోగట్ బీజేపీలో చేరి ఉండాల్సింది.. మేనమామ మహవీర్ ఫోగట్ సంచలన కామెంట్స్

by Hajipasha |
Vinesh Phogat : వినేష్ ఫోగట్ బీజేపీలో చేరి ఉండాల్సింది.. మేనమామ మహవీర్ ఫోగట్ సంచలన కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలోకి స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ చేరికపై ఆమె మేనమామ మహవీర్ ఫోగట్ పెదవి విరిచారు. వినేష్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉండి ఉంటే.. కాంగ్రెస్‌లో కాకుండా బీజేపీలో చేరి ఉండాల్సిందన్నారు. ‘‘మరో నాలుగేళ్లలో జరగనున్న ఒలింపిక్స్‌ కోసం ప్రాక్టీస్ చేయమని నేను వినేష్‌కు సలహా ఇచ్చాను. కానీ తాను మాత్రం రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది’’ అని మహవీర్ ఫోగట్ పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై తనతో వినేష్ అస్సలు చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంత అకస్మాత్తుగా రెజ్లింగ్ కెరీర్‌ను వదిలేసి ఆమె రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని తాను అస్సలు కోరుకోలేదన్నారు. కాగా, మహవీర్ ఫోగట్ చిన్న కూతురు బబితా ఫోగట్ ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హర్యానాలోని దాద్రి స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed