అతని దృష్టిలో సమంత ఎప్పుడూ సూపర్ స్టారే.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-24 15:53:23.0  )
అతని దృష్టిలో సమంత ఎప్పుడూ సూపర్ స్టారే.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా మయోసైటీస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత(Samantha).. ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’(citadel: Honey Bunny)సిరీస్‌తో మనముందుకు రాబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’(Family Man 2) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj & DK) రూపొందిన ఈ సిరీస్‌లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ భారీ అంచనాల నడుమ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది. ఇక స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ప్రమోషన్ల బిజీలో ఉన్నారు ఈ మూవీ టీమ్.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో వరుణ్ ధావన్.. సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా సమంత వర్క్‌కు అభిమానే. ఆయన సమంతను ఎన్నో సార్లు ప్రశంసించారు. ఆమెను ‘ఫిల్మ్ స్టార్’ అంటారు. మేము సమంత గురించి మాట్లాడుకున్నా అట్లీ ఆమెను సూపర్ స్టార్ అనే పిలుస్తారు. తన వర్క్‌కు అట్లీ కూడా అభిమానే. సమంత అద్భుతమైన నటి. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఆమెతో కలిసి నటించిన కొన్ని సన్నివేశాలు చాలా సరదాగా అనిపించాయి. సినిమాపై మా ఇద్దరికీ ఉన్న అభిరుచి వల్ల మేం త్వరగా కనెక్ట్ అయ్యాం. మేమిద్దరం ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలోనే ఉంటాం” అని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story