- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గవర్నర్ తమిళిసైని అడ్డుకున్న గ్రామస్తులు
దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరిలో చిన్నారి హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 8న పుదుచ్చేరి బంద్‌కు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగా.. బుధవారం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే, అనూహ్యంగా గ్రామస్తులు తమిళిసైని అడ్డుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామస్తుల డిమాండ్‌కు స్పందించిన ఆమె విచారణ అనంతరం బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విచారణకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి విక్రయాలపైనా ఫోకస్ పెట్టామని అన్నారు. ఎవరైనా ఇక నుంచి రాష్ట్రానికి గంజాయి తీసుకురావాలంటేనే భయపడాలని పేర్కొన్నారు. కాగా, కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం ఆమె ఇంటి సమీపంలోని కాలువలో లభ్యమైంది. ముత్యాల్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక మార్చి 2వ తేదీ సాయంత్రం అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు. పోలీసుల విచారణలో హత్యగా తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.