- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రియాంక వద్దకు చేరిన ‘హిమాచల్ సంక్షోభం’.. విక్రమాదిత్య భేటీ
దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ చకచకా పావులు కదుపుతున్నారు. సీఎం సుఖుపై కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేయడంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌లను విక్రమాదిత్య సింగ్ కలిశారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో హిమాచల్‌ప్రదేశ్‌లోని పరిస్థితులను వారికి ఆయన వివరించారు. ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా లేవనెత్తిన అంశాలను ప్రియాంక, వేణుగోపాల్‌ల దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విగ్రహం ఏర్పాటుకు కనీసం స్థలాన్ని కేటాయించకుండా అవమానకరంగా సీఎం వ్యవహరిస్తున్నారని విక్రమాదిత్య ఆరోపించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.