పైకి లేచి మళ్లీ సాఫ్ట్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ (వీడియో)

by Mahesh |   ( Updated:2023-09-04 08:02:25.0  )
పైకి లేచి మళ్లీ సాఫ్ట్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవంతమైన చంద్రయాన్ 3.. ల్యాండర్ విక్రమ్ మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. మొదటి విడతలో భాగంగా విక్రమ్ ల్యాండర్ దాని మిషన్ లక్ష్యాలను అధిగమించింది. అనంతరం మరోసారి ఆదేశానుసారం, అది తన ఇంజన్లను స్టార్ట్ చేసి.. దాదాపు చంద్రుడి నుంచి 40 సెం.మీ వరకు పైకి లేచింది. అనంతరం 30 - 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ 'కిక్-స్టార్ట్' భవిష్యత్ నమూనా రిటర్న్, మానవ మిషన్లను ఉత్సాహపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే అన్ని వ్యవస్థలు నామమాత్రంగా నిర్వహించబడతాయని, ప్రస్తుత ల్యాండర్ లోని అన్ని మిషన్లు ఆరోగ్యంగా ఉన్నాయి. అమలు చేయబడిన ర్యాంప్, ChaSTE, ILSA లు తిరిగి తమ స్థానాల్లోకి చేరుకున్నాయి. ఈ ప్రయోగం తర్వాత విజయవంతంగా మళ్లీ అమర్చబడ్డాయని శాస్త్రవేత్తలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Video of Vikram Lander underwent a hop experiment

Advertisement

Next Story

Most Viewed