- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vote Jihad :‘ఓట్ జిహాద్’ లాంటి పదాలను వాడిన వారిపై చర్యలు : ఈసీ
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra polls) ప్రచారంలో ‘ఓట్ జిహాద్’(vote jihad) అనే పదాన్ని పలువురు నేతలు వినియోగించడంపై మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(ECI) కిరణ్ కులకర్ణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో వాడిన అలాంటి పదాలన్నింటిని ప్రస్తుతం తాము స్క్రీన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సమక్షంలో అలాంటి పదాలను ప్రయోగించడం వల్ల చట్టపరంగా, భాషాపరంగా, సామాజికపరంగా పడే నెగెటివ్ ప్రభావాన్ని ప్రస్తుతం తాము మదింపు చేస్తున్నట్లు తెలిపారు. సమగ్ర విశ్లేషణ అనంతరం ఈ తరహా పదాలను వాడిన నేతలపై తగిన చర్యలు తీసుకుంటామని కిరణ్ కులకర్ణి వెల్లడించారు.
అటువంటి పదాలను వాడొద్దని రాజకీయ పార్టీల నేతలకు ఆయన సూచించారు. వివాదాస్పద పదాల పుట్టుక, వాటి అర్థాలు, గూఢార్ధాలపై విశ్లేషణ చేయడం అనేది దీర్ఘకాలిక స్క్రీనింగ్ ప్రక్రియలో ఒక భాగమన్నారు. అసెంబ్లీ పోల్స్ వేళ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు మహారాష్ట్రలో మొత్తం 659 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్ బూత్‌లను క్యాప్చరింగ్ చేసి ఓట్లు వేయించుకున్నారనే అభియోగాల్లో వాస్తవికత లేదని కిరణ్ కులకర్ణి స్పష్టం చేశారు.