భారత్‌పై ఆంక్షలు విధించబోం.. అగ్రరాజ్యం అమెరికా వెల్లడి

by Vinod kumar |   ( Updated:2023-02-09 17:13:10.0  )
భారత్‌పై ఆంక్షలు విధించబోం.. అగ్రరాజ్యం అమెరికా వెల్లడి
X

వాషింగ్టన్: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై ఆంక్షలు విధించబోమని, అలాంటి ఆలోచనలేవీ లేవని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగ శాఖలో యూరోపియన్, యురేషియా వ్యవహారాలను పర్యవేక్షించే అసిస్టెంట్‌ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ కరెన్‌ డాన్‌ఫ్రైడ్‌ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్పష్టం చేశారు. భారత్‌‌తో అమెరికా సంబంధాలు చాలా బలమైనవని తెలిపారు.

అలాగే, ఉక్రెయిన్‌ ప్రజలకు భారత్‌ అందిస్తున్న మానవతా సాయాన్ని ఆయన ప్రశంసించారు. కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నందుకు రష్యాపై ఈయూ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా మలుచుకున్న భారత్.. రష్యా తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటున్నది. ఈ దిగుమతులు నిలిపివేసుకోవాలంటూ భారత్‌పై పశ్చాత్య దేశాలు ఒత్తిళ్లు తెచ్చినా భారత్ ఏమాత్రం తలొగ్గలేదు. స్వతంత్ర్య విదేశాంగ విధానంతో అంతర్జాతీయ వేదికలపై గట్టిగా బదులిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed