UPSC: యూపీఎస్‌సీ నిర్ణయాన్ని హైకోర్టు లో సవాల్ చేసిన పూజా ఖేడ్కర్

by Ramesh Goud |
UPSC: యూపీఎస్‌సీ నిర్ణయాన్ని హైకోర్టు లో సవాల్ చేసిన పూజా ఖేడ్కర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అభ్యర్ధిత్వం రద్దు చేస్తూ యూపీఎస్‌సీ తీసుకున్న నిర్ణయంపై పూజా ఖేడ్కర్ హై కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ బుధవారం విచారణకు రానుంది. ఆర్బాటాలకు పోయి వివాదంలో చిక్కుక్కన్న ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌పై నకిలీ అఫిడవిట్, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దర్యాప్తు అనంతరం యూపీఎస్‌సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక భవిష్యత్తులోనూ యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరు కాకుండా జీవితకాల నిషేధం విధించింది. అయితే దీనిపై పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. యూపీఎస్‌సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ ను హైకోర్టు బుధవారం రోజు విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఇక యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు మోసపూరిత మార్గాలను అనుసరించిందని, పరీక్షలకు ఎక్కువసార్లు హాజరవడానికి నకిలీ ఐడెంటిటీ ఉపయోగించినట్టు తనపై నమోదైన కేసులో పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. పటియాలా హౌజ్ కోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది. ఆమెకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించింది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పూజా ఖేడ్కర్ దుబాయ్ పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే గత రెండు వారాలుగా పూజా ఎక్కడుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

Advertisement

Next Story

Most Viewed