UPSC సివిల్స్ అప్లికేషన్ లింక్ ఇదే..

by Harish |
UPSC సివిల్స్ అప్లికేషన్ లింక్ ఇదే..
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) బుధవారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(సీఎస్ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్- 2024 ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఫిబ్రవరి 14 నుంచి మొదలయ్యాయి. మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రిలిమ్స్ పరీక్ష మే 26న జరుగుతుంది. సివిల్ సర్వీసెస్‌‌లో మొత్తం ఖాళీలు 1,056 , ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌లో ఖాళీలు 150. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయస్సులో సడలింపులు ఉంటాయి. ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ దరఖాస్తు లింక్: https://upsc.gov.in/

Advertisement

Next Story

Most Viewed