- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
UP: వింత శిశువు జననం!.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన పసిబిడ్డ
దిశ, డైనమిక్ బ్యూరో: నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జన్మించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలకు పూణమ్ అనే మహిళ కాన్పు కోసం వచ్చింది. ఆ పీహెచ్‌సీలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజ్ కుమారి ఆమెకు పురుడు పోయగా.. మగబిడ్డ జన్మించాడు. కానీ ఆ మగబిడ్డను చూసిన నర్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైంది. ఆ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి. ఇది తెలిసిన చుట్టు ప్రక్కల గ్రామాల జనం ఈ వింత శిశువును చూసేందుకు బారులు తీరారు.
దీనిపై రాజ్ కుమారి మాట్లాడుతూ.. పూణమ్, రాంపాల్ అనే దంపతులు కాన్పు కోసం పీహెచ్‌సీ కి వచ్చారని, ఆమెకు డెలివరీ అయ్యాక మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు ముఖాలు ఉన్నాయని తెలిపింది. ఒక్క సారిగా ఈ వింత శిశువును చూడటంతో ఆ తల్లి దండ్రులు భయాందోళనకు గురయ్యారని చెప్పింది. శిశువుకు శ్వాస ఆడుతోందని, గుండె కూడా బాగానే కొట్టుకుంటుందని తెలిపింది. శిశువుకు మూతి ముడుచుకొని ఉండటం వల్ల ఏమి తాగట్లేదని, రెండు శిశువులు అతుక్కొని పుట్టడం వల్ల ఇలా జరిగిందని వివరించింది. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, జిల్లా ఆసుపత్రికి తరలించాలని చూస్తున్నట్లు స్టాఫ్ నర్స్ వెల్లడించింది.