ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు రూ.2500 కోట్లు

by Hajipasha |
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు రూ.2500 కోట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ‘మహాకుంభ్-2025’ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈమేరకు కేటాయింపులు చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్‌‌కు సంబంధించిన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు రూ. 2057 కోట్ల 76 లక్షలు కేటాయించారు. ఉత్తరప్రదేశ్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ విలువ రూ.7,36,437 కోట్లు. ఈ బడ్జెట్‌లో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన నగరాలైన ప్రయాగ్‌రాజ్, అయోధ్య, మధుర, బనారస్‌లకు పెద్దఎత్తున కేటాయింపులు జరిగాయి. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు. వారణాసిలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.400 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. వారణాసి, దాని సమీప నగరాల్లో రోప్‌వే సేవలను అభివృద్ధి చేయడానికి రూ. 100 కోట్లను కేటాయించాలని ప్రపోజ్ చేశారు. వారణాసి జిల్లాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటు కోసం భూమి కొనుగోలుకు రూ.150 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

Advertisement

Next Story