Pralhad Joshi: ఇండియా కూటమికి కూడా మమత వాల్యూ ఇవ్వదు

by Gantepaka Srikanth |
Pralhad Joshi: ఇండియా కూటమికి కూడా మమత వాల్యూ ఇవ్వదు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి ప్రహ్లా్ద్ జోషి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంటిసాకుతో మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని అన్నారు. అసలు ఇండియా కూటమికి కూడా ఆమె విలువ ఇవ్వరు అని తెలిపారు. మూడోసారి మోడీ బంపర్ విజయాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, అంతకుముందు నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి ఆమె వాకౌట్ చేశారు.

సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు. నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని సమావేశంలో ఆమె డిమాండ్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు సమావేశంలో 20 నిముషాలు మాట్లాడారని.. ఇతర నేతలు 15 నిముషాలు మాట్లాడారన్నారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైందని తాను ఒక్కరినేనని.. అయినా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed