రాజీనామా చేయను.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

by GSrikanth |   ( Updated:2023-06-03 14:54:38.0  )
రాజీనామా చేయను.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది. మెయిన్ లైన్‌లో నుంచి వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.

మొదట కోరమండల్‌కు మెయిన్ లైన్లో వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. కానీ కొద్దిసేపటికి ఇచ్చిన సిగ్నల్‌ను నిలిపివేశారని అధికారులు తెలిపారు. సిగ్నల్ నిలిపివేయడం వల్లే మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లి గూడ్స్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిందని.. పట్టాల తప్పిన కోరమండల్‌ను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిందని వెల్లడించారు. అయితే, రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశారు. తాజాగా.. ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

ఒడిశా ఘటనపై పాకిస్తాన్ ప్రధాని సహా ప్రపంచ నేతల సంతాపం

రైలు ప్రమాదానికి కారణమైన వారిని క్షమించం: ప్రధాని మోడీ

Advertisement

Next Story

Most Viewed