మణిపూర్ ఘటనపై లోక్ సభలో చర్చకు సిద్ధం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

by Javid Pasha |
మణిపూర్ ఘటనపై లోక్ సభలో చర్చకు సిద్ధం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ చర్చకు రావాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మణిపూర్ ఘటనపై లోక్ సభలో చర్చిండానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై చర్చ జరగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సున్నితమైన విషయంపై దేశ ప్రజలు నిజం తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. కాగా అంతకు విపక్షాలు, బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా.. రాజస్థాన్ లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు.

Advertisement

Next Story