Delhi విమానాశ్రయ రద్దీపై ఉన్నత స్థాయి సమావేశం

by Javid Pasha |   ( Updated:2022-12-15 05:38:13.0  )
Delhi విమానాశ్రయ రద్దీపై ఉన్నత స్థాయి సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ విమానాశ్రయ రద్దీపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హోం శాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)తో సహా MHAలోని సీనియర్ అధికారులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని అధికారులు హాజరుకానున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ల రాకపోకల్లో కచ్చితమైన టైంని పాటించకపోవడం, తనిఖీ సమయంలో గంటల తరబడి వేచి ఉండటం తదితర సమస్యలపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.


ఢిల్లీ ఎయిర్‌పోర్టు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఎయిర్‌పోర్టులో నిత్యం రద్దీ ఉంటోందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read..

BJP నేత దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి.. ముగ్గురు మృతి

Advertisement

Next Story

Most Viewed