కొన్ని పార్టీలకు ఇది ఎన్నికల అస్త్రం.. మహిళా బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-20 13:39:29.0  )
కొన్ని పార్టీలకు ఇది ఎన్నికల అస్త్రం.. మహిళా బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ చరిత్రలో సువర్ణాధ్యాయం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ అజెండాగా ఉందని.. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ అస్త్రంగా వాడుకుంటాయని ధ్వజమెత్తారు. కానీ బీజేపీకి, నరేంద్ర మోడీకి మాత్రం ఈ బిల్లు రాజకీయ అంశం కాదు అన్నారు. ప్రధాని నరేంద్ర చొరవతోనే మహిళా బిల్లు సాధ్యం అవుతున్నదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ బిల్లుతో ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడిందని చెప్పారు. ఈ బిల్లు ద్వారా విధాన నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములు అవుతారన్నారు.

Advertisement

Next Story