- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi : కేంద్ర బడ్జెట్‌లో దేశ రాజధానికి అన్యాయం : అతిషి
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో ఢిల్లీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీ ఆర్థికశాఖ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి మండిపడ్డారు. ‘‘ఢిల్లీ ప్రజలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.60 లక్షల కోట్ల పన్నులను కేంద్రానికి చెల్లించారు. అయితే అందులో కనీసం 5 శాతం నిధులను కూడా ఢిల్లీకి కేంద్ర సర్కారు కేటాయించలేదు. ఇది చాలా అన్యాయం’’ అని ఆమె ధ్వజమెత్తారు. సాక్షాత్తూ దేశ రాజధాని ప్రాంతాన్ని కేంద్ర బడ్జెట్‌లో విస్మరించడం అనేది ఆవేదన కలిగించే అంశమన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో అతిషి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాలు, యూటీలు కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నాయి. అయితే నిధులు మాత్రం కేవలం ఏపీ, బిహార్‌కు వెళ్లాయి. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం’’ అని విమర్శించారు.