- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్ రాజధానిపై రష్యా డ్రోన్‌లతో దాడులు..
కైవ్: ఉక్రెయిన్ రాజధాని కైవ్ పై రష్యా డ్రోన్‌లతో భారీ బాంబు దాడులు నిర్వహించింది. తమ దేశంపై రష్యా దండయాత్ర ప్రారంభించిన ఫిబ్రవరి నుంచి ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ పై రష్యా చేసిన 14వ డ్రోన్ దాడి ఇది. ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి 54 డ్రోన్ బాంబులతో రష్యా సైనికులు నలుదిక్కుల నుంచి విరుచుకుపడ్డారు. అందులో 40 డ్రోన్ లను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడుల హెచ్చరికల సైరన్ 5 గంటలకు పైగా మోగింది.
ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసిన డ్రోన్ బాంబుల శిథిలాలు ఒక ఏడంతస్తుల భవనంపై పడటంతో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు గాయపడ్డాడు. వేర్ హౌస్ జోన్ లో డ్రోన్ బాంబులు పేలడంతో మంటలు ఆకాశంలో ఒక కిలోమీటర్ ఎత్తున ఎగిసిపడ్డాయి. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఒక పెట్రోల్ బంకు సమీపంలో పడిన డ్రోన్ బాంబుతో 41 ఏళ్ల వ్యక్తి మరణించాడు. 35 ఏళ్ల మహిళ గాయపడిందని కైవ్ మేయర్ విటాలి క్లిట్ ష్కో తెలిపారు. మరోవైపు తమ భూభాగంలోని పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్ తో బాంబు దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా భూభాగంపై దాడులు జరిగినట్లు పేర్కొన్నది. ఆ దాడులకు ప్రతీకారంగానే కైవ్ పై దాడులుగా అభివర్ణించింది.