- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > Udhayanidhi Stalin : తమిళనాడులో మంత్రులంతా డిప్యూటీ సీఎంలే : ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin : తమిళనాడులో మంత్రులంతా డిప్యూటీ సీఎంలే : ఉదయనిధి స్టాలిన్
by Hajipasha |

X
దిశ, నేషనల్ బ్యూరో : తనను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఉదయనిధి స్టాలిన్ కొట్టిపారేశారు. ‘‘డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే అని నేను గతంలో కూడా మీడియాకు చెప్పాను’’ అని ఆయన పేర్కొన్నారు. డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ పదవే తనకు అత్యంత ఇష్టమైన పదవి అని స్పష్టం చేశారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం కోసం యువజన విభాగం కార్యకర్తలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలని ఉదయనిధి కోరారు. రోజూ ఉదయం, సాయంత్రం చెరో 10 నిమిషాలు సోషల్ మీడియాకు కేటాయించి, డీఎంకే ప్రభుత్వం పనితీరు గురించి ప్రజలకు వివరించాలన్నారు. తమిళనాడులో ఏ కూటమి ఏర్పడినా డీఎంకే కూటమికే విజయం దక్కాలని పేర్కొన్నారు.
Next Story