తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!..త్వరలోనే ప్రకటించే చాన్స్

by vinod kumar |
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!..త్వరలోనే ప్రకటించే చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) యువనేత, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారని కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ఏడాది ఉదయనిధిని రెండుసార్లు డిప్యూటీ సీఎం చేయాలని భావించగా..పలు వివాదాల కారణంగా ప్రకటన ఆలస్యమైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన తండ్రి స్టాలిన్‌పై భారాన్ని తగ్గించేందుకు ఉదయనిధికి పదోన్నతి కల్పిస్తున్నారని తెలుస్తోంది.

ఆగస్టు 22న సీఎం స్టాలిన్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ లోపే ఉదయనిధికి కీలక పదవి ఇవ్వనున్నట్టు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల అనంతరం స్టాలిన్‌ను ఆయన తండ్రి కరుణానిధి డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇప్పుడు కూడా 2024 లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అదే పద్ధతిలో తన కుమారుడిని స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిని చేయబోతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. కాగా, ఉదయనిధి స్టాలిన్ చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం డిసెంబరు 2022లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story

Most Viewed