- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సొరంగ నిర్మాణ ప్రాంతంలో ఉగ్రమూక కాల్పులు.. ఇద్దరు మృతి
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir)లో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారంరోజులైనా కాకుండానే ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. గాందర్ బల్ జిల్లా సోన్ మార్గ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఓ సొరంగమార్గం నిర్మాణ ప్రదేశంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతులు వలస కార్మికులని భద్రతా బలగాలు తెలిపాయి. వారి వ్యక్తిగత వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. కాగా.. రెండ్రోజుల క్రితమే షోపియాన్ జిల్లాలో బిహార్ కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపారు. మళ్లీ జమ్మూకశ్మీర్ లో మరో ఇద్దరు చనిపోవడంతో.. ఉగ్రవాదుల కదలికలపై బలగాలు నిఘా పెంచాయి.
ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందిన ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి చెందారు. మరణించిన ఇద్దరు కార్మికులు సొరంగం నిర్మాణ ప్రాజెక్ట్ లో కీలకమైన వర్కర్లని తెలిపారు. వారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, గాయపడిన వారికి శ్రీనగర్లోని ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు.
The casualty figure from the Gagangir attack is not final as there are a number of injured labourers, both local & non-local. Praying that the injured make a full recovery as the more seriously injured are being referred to SKIMS, Srinagar.