తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి

by S Gopi |
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా కేంద్రంలో మంగళవారం జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు చిదంబరపురానికి చెందిన మరియప్పన్ (45), మురుగన్ (45)గా గుర్తించారు. వీరు శివకాశిలోని కలయార్‌కురిచ్చిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గాయపడిన వారిని శంకరవేల్, సరోజగా గుర్తించి చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాణాసంచా ఫ్యాక్టరీలో కెమికల్స్ కలిపే సమయంలో నిప్పురవ్వ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబానికి రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఇటీవల జూన్ 29న విరుదునగర్‌లోని ఓ ప్రైవేట్‌ బాణసంచా తయారీ యూనిట్‌లో కూడా పేలుడు సంభవించి నలుగురు చనిపోయారు. అంతకుముందు మే 9న శివకాశిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఎనిమిది మంది చనిపోయారు.

Advertisement

Next Story

Most Viewed