జమ్మూ కాశ్మీర్‌లో మారోసారి ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

by Mahesh |
జమ్మూ కాశ్మీర్‌లో మారోసారి ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్‌లో చోటు చేసుకుంది. శనివారం అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తుండగా జవాన్లకు అడ్డుపడిన ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. ఉగ్రదాడిలో గాయపడిన ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోకెర్‌నాగ్ సబ్‌డివిజన్‌లో అటవీలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జవాన్ల పెట్రోలింగ్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశారు. విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్‌లను రంగంలోకి దింపారు. కాగా జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Next Story