- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cabinet Secretary: రాజీవ్ గౌబా స్థానంలో టీవీ సోమనాథన్.. రెండేళ్ల పాటు..
దిశ, నేషనల్ బ్యూరో: క్యాబినెట్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను కేంద్రం శనివారం నియమించింది. రాజీవ్ గౌబా సుదీర్ఘ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.
తమిళనాడు కేడర్‌కు చెందిన 1987-బ్యాచ్ ఐఏఎస్ అధికారి, టీవీ సోమనాథన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన 2019 నుండి 2021 వరకు ఆర్థిక వ్యయ కార్యదర్శిగా పనిచేశారు. 2015- 17 మధ్య ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంఓ) జాయింట్ సెక్రటరీగా, అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2007 నుండి 2010 వరకు చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ముఖ్యమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు.
ఇదిలా ఉంటే ఐదేళ్ల క్రితం క్యాబినెట్ సెక్రటరీగా రాజీవ్ గౌబా ఆగస్టు 30, 2019న బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పదవీ కాలాన్ని 2021లో పొడిగించారు. మళ్లీ 2023లో పొడిగించారు. రాజీవ్ గౌబా జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు.