- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Turkey - Syria EarthQuake : ఇండియన్ ఆర్మీకి టర్కీ మహిళ థ్యాంక్స్.. ఫోటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా టర్కీకి ఇండియా ఆర్మీ మెడికల్ సప్లై లను పంపింది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా మన సైనికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఆ ఫోటోలో టర్కీకి చెందిన ఓ మహిల మన దేశ సైనికాధికారిని ముద్దాడుతోంది. ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ (ఏడీజీ పీఐ) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు 'వీ కేర్' అని క్యాప్షన్‌ను జత చేసింది.
ఈ ఫోటోను చూసిన చాలా మంది ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తూ కామెంట్ పెడుతున్నారు. 'వారు యుద్ధం చేయడానికి రాలేదని, తమ దేశ పౌరులతో పాటు ఇతర దేశాల పౌరులను కాపాడేందుకు వచ్చారు. బిగ్ కుడోస్ టు ద టీమ్' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'మానవత్వమే అతి పెద్ద మతం అని, భారతీయ సంస్కృతి స్ఫూర్తి' నింపుతుందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా టర్కీ, సిరియాలో 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ఇప్పటి వరకు 21వేల మంది మరణించారు. సిరియాలో 3,377 మంది, టర్కీలో 17,674 మంది ప్రాణాలు విడిచారు. ఈ భూకంపంలో 3వేల భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అందులో కొన్ని ఆస్పత్రులు కూడా ఉన్నాయి.