క్యాపిటల్‌ భవనంపై దాడి కేసులో ట్రంప్ సంచలన నిర్ణయం

by D.Reddy |
క్యాపిటల్‌ భవనంపై దాడి కేసులో ట్రంప్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. తొలిరోజే పలు కీలక అంశాలపై సంతకాలు చేశారు. అలాగే బైడెన్‌ సర్కారు తీసుకున్న ఏ నిర్ణయాలూ అమలు కాకుండా చూస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇక ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే.. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాదు ఆరుగురి శిక్షలను కూడా తగ్గించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అల్లర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని US అటార్నీ జనరల్‌ను కూడా నిర్దేశించారు.

అసలేం జరిగిదంటే..?

2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ క్యాపిటల్‌ భవనంలో కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్‌ మద్దతుదారులు ఒక్కసారి వేలాదిగా క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో 140 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడ్డారు. USAలో అధికారులపై జరిగిన అతిపెద్ద సామూహిక దాడుల్లో ఒకటిగా అమెరికా చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed