- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trump: రేపు పుతిన్‌తో మాట్లాడనున్న ట్రంప్.. కాల్పుల విరమణపై డిస్కస్ చేసే చాన్స్!

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) తో మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడతానని తెలిపారు. ఇప్పటికే సీజ్ ఫైర్ అంశంపై ఓ కొలిక్కి వచ్చామని వెల్లడించారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు వస్తుండగా ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మాట్లాడతా. ఇప్పటికే యుద్ధాన్ని ముగించడంపై ఎంతో పని జరిగింది. యుద్ధాన్ని ముగిస్తారో లేదో చూడాలనుకుంటున్నాం. వార్ ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. బహుశా అది సాధ్యం అవుతుందో లేదో తెలియదు. కానీ ఆపే అవకాశం ఉందని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఏయే విషయాలపై పుతిన్ తో చర్చిస్తారనే దానిపై స్పష్టం చేయలేదు.
అయితే గతవారం సౌదీలోని జెడ్డాలో జరిగిన చర్చల సందర్భంగా 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది. అయితే దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంతేగాక సీజ్ ఫైర్ పై పలు కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై ట్రంప్ పుతిన్‌తో డిస్కస్ చేసే చాన్స్ ఉన్నట్టు సమాచారం. కాగా, ఉక్రెయిన్ రష్యాల మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుతిన్ తో మాట్లాడిన అనంతరం ఆయన చేసే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యుద్ధాన్ని ముగించడంపై కీలక ప్రకటన సైతం ఉండబోతుందని పలువురు భావిస్తున్నారు.
Read More..
Rajnath Singh: రాజ్ నాథ్ సింగ్ తో తులసీ గబ్బార్డ్ భేటీ.. దేనిపై చర్చ జరిగిందంటే?