ఉత్కంఠ భరితంగా త్రిపుర ఫలితాలు..

by Mahesh |
ఉత్కంఠ భరితంగా త్రిపుర ఫలితాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రాష్ట్రాల్లో 2023 అసెంబ్లీకి జరిగిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో నాగాలండ్‌లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం వస్తుండగా.. మేఘాలయాలో హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి. అలాగే త్రిపుర లో మొదట్లో స్పష్టమైన ఆధిక్యం లో కొనసాగిన బీజేపీ ఇప్పుడు తన ఆఫ్ మార్క్ లీడ్ ను కోల్పోయింది.

ప్రస్తుతం త్రిపుర ఫలితాలు బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం త్రిపురాలో బీజేపీ 27, లెఫ్ట్+ 19 స్థానాలు, టీఎమ్‌పీ 13 స్థానాలు, అదర్స్ 1 స్థానం లీడ్ లో కొనసాగుతున్నారు.కాగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 31 సీట్లు కావాలి. మొత్తానికి త్రిపురాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.

Advertisement

Next Story