- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ.. కాంగ్రెస్‌కు త్రిపుర ఈసీ నోటీసులు..
అగర్తలా: ఎన్నికల నియామవళిని ఉల్లంఘించి సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కాంగ్రెస్, బీజేపీలకు త్రిపుర ప్రధాన ఎన్నికల అధికారి నోటీసుల జారీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓట్లు వేయాలని కోరుతూ ఇరు పార్టీలు కోరడంపై వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి అమల్లో ఉన్న 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో చేసిన ట్వీట్లు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇరు పార్టీలు వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘన పై తమ వైఖరిని వెల్లడించాలని శుక్రవారం సాయంత్రం లోగా కోరింది.
గురువారం ఉదయం సురక్షిత, సుసంపన్న భవిష్యత్తు కోసం బీజేపీ కి ఓటు వేయాలని బీజేపీ ట్వీట్ చేసింది. త్రిపుర ప్రజలు తెలివిగా కాంగ్రెస్ ఓటు వేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈసీ నోటీసులు జారీ చేసింది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రిపుర ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో భాగం కావాలని ట్వీట్ చేశారు.