Trending: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. ఆ ప్రాంతంలో పనిచేస్తే ఏకంగా రూ.8 లక్షల ప్యాకేజ్

by Shiva |
Trending: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. ఆ ప్రాంతంలో పనిచేస్తే ఏకంగా రూ.8 లక్షల ప్యాకేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: సిటీ కల్చర్‌కు అలవాటు పడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కేవలం ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పని చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లిలో ప్రారంభించిన ఇన్ఫోసిస్ క్యాంపస్‌ ఉద్యోగుల ఆదరణకు నోచుకోవడం లేదు. సిటీకి చాలా దూరం ఉండటంతో ఎవరూ అక్కడి విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడి ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కేవలం మొక్కలు మాత్రమే మొలుస్తున్నాయని, ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదని ఓ ఎమ్మెల్యే సెటైర్ వేశాడు. యువతకు ఉద్యోగాలు ఇస్తారనే ప్రభుత్వం క్యాంపస్ నిర్మాణానికి 58 ఎకరాలు భూమి కేటాయించిందని ఎద్దేశా చేశాడు. ఆ వ్యాఖ్యలకు స్పందించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం హుబ్బళ్లిలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌‌ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

హుబ్బళ్లిలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పని చేసేందుకు ముందుకొస్తే రూ.8 లక్షల వరకు శాలరీ ఇస్తామంటూ ఉద్యోగులకు ఇటీవలే ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందజేసింది. ప్రాజెక్టు డెవలప్‌మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్-2, ఆపై స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ బెనిఫిట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఇండియాలో ఉన్న ఏ డెవలప్‌మెంట్ సెంటర్‌ నుంచి అయినా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని తెలిపింది. ఇక బ్యాండ్-3 అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25 వేలు ఇస్తామని పేర్కొంది అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపింది. హుబ్బళ్లి క్యాపస్‌కు వచ్చిన వారు రూ.1.25 లక్షల ప్రోత్సహకాలు అందుకోనున్నారు. బ్యాండ్-4 ఉద్యోగులకు రూ.2.5 లక్షలు, బ్యాండ్-5 రూ.5 లక్షలు, బ్యాండ్‌-6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షల ప్రోత్సహకాలను కంపెనీ అందజేయనుంది.

Advertisement

Next Story