Trending: భూమిని ఢీకొట్టేందుకు వస్తున్న భారీ గ్రహ శకలం.. ఇస్రో చీఫ్ సంచలన స్టేట్‌మెంట్

by Shiva |
Trending: భూమిని ఢీకొట్టేందుకు వస్తున్న భారీ గ్రహ శకలం.. ఇస్రో చీఫ్ సంచలన స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ క్రికెట్ స్టేడియం అంత పెద్దగా ఉన్న ఓ గ్రహ శకలం భూ గ్రహం వైపునకు దూసుకొస్తోందని ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్.సోమనాథ్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితిని తాము నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు. ఆ శకలం పేరు ‘అపోఫిస్’ అని ఏప్రిల్ 13, 2029న అది భూమికి అతి సమీపం నుంచి వెళ్లనుందని పేర్కొన్నారు. భూమికి సుమారు 32 వేల కి.మీ ఎత్తులో శకలం వెళ్లనున్నట్లుగా అంచానా వేశామని తెలిపారు. భారత జియో స్టేషనరీ శాటిలైట్స్ తిరిగే కక్ష్యకు అతి దగ్గరగా అపోఫిస్ శకలం ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక దాని పరిమాణం ఓ క్రికెట్ స్టేడియం అంత పరిమాణంలో ఉంటుందని సోమనాథ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed