ఖరగ్‌పూర్ - భద్రక్ మార్గంలో ఇవాళ,రేపు రైళ్లు రద్దు

by Seetharam |
ఖరగ్‌పూర్ - భద్రక్ మార్గంలో ఇవాళ,రేపు రైళ్లు రద్దు
X

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యాయి. బాలేశ్వర్ సమీపంలో ట్రాక్ మరమత్తుల పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. ఖరగ్‌పూర్ - భద్రక్ మార్గంలో ఇవాళ, రేపు షెడ్యూల్ చేసిన రైళ్లు రద్దు చేశారు. ఈ మార్గంలో నడిచే పురూలియా -విల్లుపురం, ఎస్ఎంబీటీ బెంగళూరు -హావ్‌డా రైళ్లు రద్దు అయ్యాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులను అశ్వనీ వైష్ణవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఒడిశా రైలు ప్రమాదంపై అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లి దండ్రులను కోల్పోయిన పిల్లల చదువుల బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు.

Advertisement

Next Story