2024 ప్రారంభానికల్లా కశ్మీర్‌కు రైలు మార్గం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణోయ్

by sudharani |
2024 ప్రారంభానికల్లా కశ్మీర్‌కు రైలు మార్గం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణోయ్
X

శ్రీనగర్: ఎట్టకేలకు కశ్మీర్ లోయను రైల్వే సర్వీసుతో దేశానికి అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణోయ్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రైల్వే లైన్ పూర్తి చేసి తొలి రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. శనివారం ఆయన ఉదాంపుర్-బనిహల్ రైల్ లింక్ ప్రాజెక్టు సమీక్షలో భాగంగా బరాముల్లా స్టేషన్‌ను సందర్శించారు.

‘జమ్ముకశ్మీర్ కోసం అక్కడి వాతవరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక డిజైన్‌తో వందేభారత్ రైలును తయారు చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థం ముగిసే సరికి రైలు అందుబాటులోకి వస్తుంది’ అని వైష్ణవ్ అన్నారు. మరోవైపు కేంద్రం చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన రైల్వే బ్రిడ్జి పనులను సమీక్షించారు. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై ట్రయల్ రన్ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed