Train Accedent: పట్టాలు తప్పిన ఢిల్లీ ప్యాసింజర్ రైలు

by Ramesh Goud |
Train Accedent: పట్టాలు తప్పిన ఢిల్లీ ప్యాసింజర్ రైలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో రెండు కోచ్ లు వేరే రైలు మార్గం మీదికి వెళ్లాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ లో జరిగింది. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల రైళ్లు ఢీ కొనడం జరుగుతుండగా.. మరి కొన్ని చోట్ల పట్టాలు తప్పుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ ఉత్తరప్రదేశ్ లో మరో ప్రమాదం జరిగింది. ఢిల్లీ వెళుతున్న ప్యాసింజర్ రైలు సహరాన్‌పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని రెండు కోచ్ లు వేరే రైలు మార్గం వైళ్లి ఆగాయి. ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమై ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అనంతరం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మరమ్మత్తులు కొనసాగిస్తున్నారు. ఈ వరుస ప్రమాదాల పట్ల రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఘటనల పై రైల్వే మంత్రి స్పందించకపోవడంపై ప్రతిపక్షాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవ్వాళ్టి ఘటనలపై కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ లో రైలులో మంటలు రాగా.. ఉత్తరప్రదేశ్ లో రైలు పట్టాలు తప్పిందని తెలిపింది. అంతేగాక "రీల్ మినిస్టర్ ప్రకారం పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి" అని రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ పై విమర్శలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed