- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టాలు తప్పిన టాయ్‌ట్రైన్.. ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి!
X
దిశ, డైనమిక్ బ్యూరో: పర్వత రైల్వే సర్వీసుల్లో ఒకటైన టాయ్‌ట్రైన్ మరోసారి పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని మాథేరన్ హిల్ స్టేషన్ నుంచి నేరల్‌కు వెళ్తుండగా.. ముంబైకి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుమ్మాపట్టి స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైలు ఇంజన్ చక్రాలలో ఒకటి పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన టైంలో టాయ్ ట్రైన్‌లో 95 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు రైలు దిగి క్యాబ్‌లలో తమ గమ్యస్థానాలకు వెళ్లారని తెలిపారు. కాగా, టాయ్ ట్రైన్ పట్టాలు తప్పడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. ఈ ఘటనతో నేరల్ నుంచి మాథేరన్ వెళ్లే రైలును అధికారులు రద్దు చేశారు.
Advertisement
Next Story