Tractro march: ఆగస్టు 15న ట్రాక్టర్ మార్చ్.. ప్రకటించిన రైతు సంఘాలు

by vinod kumar |
Tractro march: ఆగస్టు 15న ట్రాక్టర్ మార్చ్.. ప్రకటించిన రైతు సంఘాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతు సంఘాలు నిరసన తెలుపనున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా కేఎంఎం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ..ఆగస్టు 31 నాటికి ఢిల్లీకి రైతుల పాదయాత్ర 200 రోజులు పూర్తవుతుందని పేర్కొన్నారు. అనంతరం అదే నెల 1న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు రైతులు పాదయాత్రలు నిర్వహించి అధికార బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపారు. ఆగస్టు15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ, శంభు పాయింట్ల వద్ద ప్రజలు గుమికూడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed