- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బాండ్ల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించిన ఎస్‌బీఐ
దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించిన ఒక రోజు తర్వాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపింది. భారత అత్యున్నత న్యాయస్థానానికి అఫడవిట్ సమర్పిచిన ఎస్‌బీఐ, 2019, ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తం 22,217 ఎన్నికల బాండ్లను దాతలు కొనుగోలు చేశారని, అందులో 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకుని నిధులు తీసుకున్నట్టు ఎస్‌బీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. మిగిలిన 187 బాండ్లను నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్టు స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ మొత్తం నిధుల్లో ఏ పార్టీకి ఎంతమేరకు నిధులు వెళ్లాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 15 సాయంత్రం నాటికి ఈసీ ఆ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. 'సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి గడించిన ఐదేళ్ల కాలంలో తాము జారీ చేసిన ఎన్నికల బాండ్ల వివరలను మార్చిన 12న ఎన్నిక సంఘానికి ఇచ్చాము. బాండ్లను ఎవరెవరు కొనుగోలు చేశారు, ఏ పార్టీలు ఎంతమొత్తం నిధులను తీసుకున్నాయనే వివరాలను అందజేశామని ' ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ అఫిడవిట్‌లో వివరించారు.