ఆ కత్తి విలువ అక్షరాల రూ.140 కోట్లు

by sudharani |   ( Updated:2023-05-25 13:14:39.0  )
ఆ కత్తి విలువ అక్షరాల రూ.140 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 18వ శతాబ్దంలో మైసూర్‌ని పరిపాలించిన టైగర్ టిప్పు సుల్తాన్‌ గురించి చరిత్రలో చదివే ఉంటారు. ఆయనకు చెందిన ఆయుధాల్లో ఖడ్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా ఈ ఖడ్గాన్ని లండన్‌లో వేలం వేయగా అది రూ. 140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వ‌హించిన బాన్‌హ‌మ్స్ హౌజ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. టిప్పు సుల్తాన్‌కి చెందిన అన్ని ఆయుధాల్లో ఈ కత్తికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

ఈ కత్తి 16వ శతాబ్దంలో భారతదేశానికి తీసుకువచ్చిన జర్మన్ బ్లేడ్ డిజైన్‌ను ఉపయోగించి మొఘలుల కాలంలో తయారు చేశారట. 18వ శ‌తాబ్ధంలో ఎన్నో యుద్ధాల‌ను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖ‌డ్గాన్ని వాడిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. 1175 నుంచి 1779 వరకూ మరాఠాలపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ ఖడ్గాన్ని వాడినట్టు చెబుతోంది బోన్ హన్స్ సంస్థ. టిప్పు సుల్తాన్ మృతి త‌ర్వాత బ్రిటీష్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ డేవిడ్ బ‌యిర్డ్‌కు ఈ ఖ‌డ్గాన్ని అంద‌జేశారు.

Advertisement

Next Story

Most Viewed