బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-12 06:25:54.0  )
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. టికెట్ ఆశించి భంగపడిన ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వంతో పాటు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 189 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను నిన్న ప్రకటించింది. ఇందులో 52 మందికి కొత్తగా అవకాశం లభించింది. కాగా బీఎస్ యడియూరప్ప తర్వాత బలమైన లింగాయత్ నాయకులలో ఒకరిగా ఉన్న లక్ష్మణ్‌కు పేరు ఉంది. అయితే పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకు రేపు తన అనుచరులతో భేటీ కాబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed