- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నాలుగు కులాలే భారత్‌కు భరోసా: ప్రధాని నరేంద్ర మోడీ
by samatah |
X
దిశ, నేషనల్ బ్యూరో: పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు కులాలు అభివృద్ధి చెందినప్పుడే భారత్‌కు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ఉద్దేశించి సోమవారం మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించడమే యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 12 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ యాత్ర పేదల ఆరోగ్యానికి కూడా ఒక వరం లాంటిదని చెప్పారు. దేశంలోని ప్రతి మూలకూ మోడీ వాహనం చేరుతుందని చెప్పిన ప్రధాని.. మోడీకి గ్యారంటీపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. గతేడాది నవంబర్ 15 న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను మోడీ ప్రారంభించారు.
Advertisement
Next Story